హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో కిలాడీ లేడీ.. రూ.6.32 కోట్లు మోసం!

నెల్లూరులో ఫోరెక్స్ ట్రేడింగ్, దుబాయ్ గోల్డ్, MBBS సీట్ల పేరుతో రూ.6.32 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. సరస్వతి నగర్‌కు చెందిన సి. అనూష జిల్లా ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశారు. ఏడుగురు కలిసి వ్యవస్థీకృతంగా మోసం చేశారని ఆమె ఆరోపించారు. తక్కువ ధరకు గోల్డ్ బిస్కెట్లు, విదేశీ MBBS సీట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు.