SRPT: కోదాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీకి నూతన కార్యాలయ భవనాల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం మంగలితండాలో ఉపాధి హామీ నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కూచిపూడిలో రూ.12 లక్షలతో, కాపుగల్లులో రూ.24 లక్షలతో నిర్మించిన మూడు అంగన్‌వాడీ భవనాలను ప్రారంభించారు.
తెలంగాణ
ప్రతి గ్రామపంచాయతీకి నూతన భవనాలు: ఎమ్మెల్యే


