KDP: ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యానాది కాలనీలో సోమవారం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేపట్టి, వాహనాల రికార్డులను పరిశీలించారు.సరైన పత్రాలు లేని 40 వాహనాలను సీజ్ చేశారు.వీటిలో 38 బైకులు, 2 ఆటోలు ఉన్నాయి.ASP విభుకృష్ణ పర్యవేక్షణలో CIలు నాగభూషణ్, కొండారెడ్డి, వంశీనాథ్, రామాంజనేయుడు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
యానాది కాలనీలో పోలీసుల తనిఖీలు..!


