హైదరాబాద్: 28°C
వార్తలు

అమిత్ షా సమక్షంలో కీలక ఒప్పందం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల మధ్య సోన్ నదీ జలాల పంపిణీపై కీలక ఒప్పందం కుదిరింది. తూర్పు భారతదేశంలో దీర్ఘకాలంగా ఉన్న జల వివాదం ఈ ఒప్పందంతో పరిష్కారమైందని అమిత్ షా తెలిపారు. దీనిద్వారా రెండు రాష్ట్రాల్లోని లక్షలాది మంది రైతులకు సాగునీటితో పాటు, ప్రజలకు తాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ పాల్గొన్నారు.