హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంపీ మాగుంట వ్యాఖ్యలపై బూచేపల్లి ఫైర్

ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు వద్ద మాజీ సీఎం జగన్‌పై ఒంగోలు MP మాగుంట శ్రీనివాసులురెడ్డి చేసిన వ్యాఖ్యలపై దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన జగన్‌పై ఈ విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో 2 సొరంగాలను పూర్తి చేసింది తమ ప్రభుత్వమేనని బూచేపల్లి అన్నారు.