AKP: నర్సీపట్నం ఎడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం. రోహిత్ సోమవారం స్థానిక సబ్ జైలును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన జైలులో ఖైదీలకు అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఖైదీలకు న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకుంటే వెంటనే తమను సంప్రదించాలని సూచించారు. ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
వార్తలు
సబ్ జైలును తనిఖీ చేసిన న్యాయమూర్తి


