హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌లోనే జావెలిన్ క్షిపణుల తయారీ

భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అత్యాధునిక 'జావెలిన్‌' క్షిపణులు ఇకపై భారత్‌లోనే తయారు కానున్నాయి. ఇందుకోసం టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌, జావెలిన్ జాయింట్ వెంచర్ మధ్య ఓ కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. కాగా, ఈ క్షిపణుల కొనుగోలు కోసం భారత్-అమెరికా మధ్య ఇటీవలే అధికారిక ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే.