హైదరాబాద్: 28°C
వార్తలు

పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ

కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(SCO) సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో PM మోదీ సమావేశమయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని, శాంతియుత పరిష్కారానికి భారత్ మద్దతు ఇస్తుందని మోదీ పేర్కొన్నారు. యుద్ధం జరిగే ప్రతి రోజూ మానవాళిని వెనక్కి నెడుతుందన్నారు. మరోవైపు ఇరు దేశాల సంబంధాలు బలపడుతున్నాయని పుతిన్ వెల్లడించారు.