హైదరాబాద్: 28°C
వార్తలు

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

ప్రకాశం: కొమరోలు మండలంలోని బాదినేనిపల్లి గ్రామానికి చెందిన కామూరి రామచంద్రారెడ్డి పనిమీద ద్విచక్ర వాహనంపై గిద్దలూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా రాజుపాలెం సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. స్కూటర్ అదుపుతప్పి కిందపడటంతో రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు.