2029 ప్రధాని అభ్యర్థిగా విజయ్‌ను ఆయన పార్టీ 'టీవీకే' ప్రచారం చేసుకోవడంపై డీఎంకే నేత ఆర్.ఎస్.భారతి సెటైర్లు వేశారు. ఊహించుకోవడానికి హద్దుల్లేవని, భవిష్యత్తులో విజయ్ ఏకంగా ఐరాస అధిపతి కూడా అవుతారేమోనంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు టీవీకే సర్వేలు వాస్తవ దూరమని, అవి ఏమాత్రం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించవని కాంగ్రెస్ నేత మణికం టాగూర్ స్పష్టం చేశారు.
వార్తలు
విజయ్ ఐరాస అధిపతి అవుతారేమో: డీఎంకే సెటైర్లు


