ADB: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం మావల మండలంలోని భట్టి సవర్గామ, వాఘాపూర్ గ్రామాల్లో స్థానికులతో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ప్రతి గ్రామంలో ప్రజలు బాధ్యతగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నేరాల నివారణకు సాంకేతికతను వినియోగించుకోవాలని కోరారు.
తెలంగాణ
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం: SP


