హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థినులకు స్వీయ రక్షణ శిక్షణ

ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులకు పీఎం-ఉషా పథకం కింద 30 రోజుల స్వీయ రక్షణ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సత్యనారాయణ సోమవారం తెలిపారు. కరాటే చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ పాండు రాజు పర్యవేక్షణలో శిక్షణ కొనసాగుతోందని చెప్పారు. విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యం, స్వీయ రక్షణ నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యమన్నారు.