ఖమ్మం: 15వ ఎన్‌ఎండీసీ హాఫ్ మారథాన్‌లో ఖమ్మం లాకారం రన్నర్స్ ప్రతిభ చాటారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 21 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. ఈ పోటీలో లాకారం రన్నర్స్‌కు చెందిన ఎనిమిది మంది సభ్యులు పాల్గొన్నారు. వీరంతా 2 గంటల 20 నిమిషాల్లో పరుగును పూర్తి చేసి పతకాలు అందుకున్నారు. దీంతో ఖమ్మం లాకారం రన్నర్స్ అభినందనలు అందుకున్నారు.
తెలంగాణ
హాఫ్ మారథాన్‌లో ఖమ్మం రన్నర్స్ జోరు


