హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగ ధ్రువీకరణపై ఫిర్యాదు

KMM: తల్లాడకు చెందిన గాదే నాగేంద్రబాబు వాడవల్లి నాగేశ్వరరావుపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తప్పుడు దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వాన్ని మోసం చేసి రూ.1.49 లక్షలు స్వాహా చేశారని ఆరోపించారు. ఆ మొత్తాన్ని రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా వసూలు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.