హైదరాబాద్: 28°C
తెలంగాణ

డోలార పెన్ గంగా నదికి ఘనంగా పాలాభిషేకం

ADB: భోరజ్ మండలంలోని డోలార గ్రామ సమీపంలోని పెన్ గంగా నది వద్ద సోమవారం వేద పండితుల ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కలశ ప్రతిష్టాపన, గణపతి పూజ, చండీయాగం చేపట్టారు. భక్తులు పవిత్ర గంగ స్నానాలు ఆచరించి అమ్మవారికి పాలాభిషేకం చేశారు. గత 30 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కిషన్ మహారాజ్ పేర్కొన్నారు.