NRPT: బాలికలకు పరిశుభ్రమైన, సురక్షిత విద్యా వాతావరణం కల్పించేందుకు కలెక్టర్ ప్రియాంక ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జిల్లాలో బాలికల నమోదు ఉన్న 83 ఉన్నత పాఠశాలలకు స్వచ్ఛ భారత్ మిషన్ నిధులతో శానిటరీ న్యాప్కిన్ ఇన్సినరేటర్లను సోమవారం కలెక్టరేట్‌లో అధికారులకు అందజేశారు. పాఠశాలల్లో బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతకు అవసరమైన సదుపాయాలు కల్పించడం ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
తెలంగాణ
బాలికల పరిశుభ్రతకు పెద్దపీట: కలెక్టర్


