హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫీజు బకాయిలు విడుదల చేయాలి'

SRPT: రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ సూర్యాపేట జిల్లా కన్వీనర్‌ విజయ రామరాజు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌కు వినతిపత్రం అందజేశారు. బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని కళాశాలలను ఆదేశించాలని కోరారు.