హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ ప్రజావాణికి 8 ఫిర్యాదులు

NGKL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి. పాటిల్ ఫిర్యాదుదారుల నుంచి 8 అర్జీలు స్వీకరించారు. వీటిలో భూ వివాదాలకు సంబంధించి 4, న్యాయపరమైన అంశాలపై 3, భార్యాభర్తల వివాదానికి సంబంధించి ఒక ఫిర్యాదు ఉన్నాయి. సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.