HNK: హసన్‌పర్తి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం 22 మంది అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు 6, జీడబ్ల్యూఎంసీకి 2, విద్యుత్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 11 దరఖాస్తులు అందాయి. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎంపీడీవో సుమనవాణి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి: ఎంపీడీవో


