హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుల్లెట్ ట్రైన్ కోసం రిలే నిరాహార దీక్ష

SRPT: బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 18వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు సట్టు నాగయ్య, రాచకొండ దేవయ్య ఆధ్వర్యంలో సభ్యులు దీక్షలో కూర్చున్నారు. వారికి బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపారు.