హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో 162 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్

SRCL: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో భారీగా దరఖాస్తులు వచ్చాయి.  ప్రజలు సమర్పించే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈసారి ప్రజావాణికి మొత్తం 162 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.