హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలి'

SRPT: మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని తహసీల్దార్ లావూరి మంగ సూచించారు. సోమవారం సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రసాయనిక ఎరువులతో భూసారం దెబ్బతింటోందని, జీవామృతం, పశువుల పెంట, పచ్చిరొట్ట ఎరువులతో భూసారాన్ని పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మల్సూర్, సర్పంచ్ పాల్గొన్నారు.