హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజన్న ఆలయ లడ్డూలో పురుగు.. చర్యలకు డిమాండ్

SRCL: వేములవాడ రాజన్న ఆలయంలో అపచారం జరిగింది. భక్తిశ్రద్ధలతో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దామని భావించిన భక్తుడికి లడ్డూలో పురుగు ప్రత్యక్షమయింది. దీంతో షాక్ తిన్న సంతోష్ దంపతులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిత్యం వేలాది మంది భక్తులు  కొనుగోలు చేసే లడ్డూప్రసాదంలో పురుగులు రావడంపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తగిన జాగ్రత్తుల తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.