హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూరగాయల మార్కెట్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌

JN: జనగామ కూరగాయల మార్కెట్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా మారింది. రైల్వే స్టేషన్‌ నుంచి అంబాబావి ఉప్పలమ్మ దేవాలయం వరకు రద్దీగా ఉండే మార్గంలో కూరగాయల ట్రాలీలు, ఆటోలను ఇష్టారాజ్యంగా నిలిపేస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.