హైదరాబాద్: 28°C
తెలంగాణ

పదవీ విరమణ పొందిన పోలీసులకు ఎస్పీ సన్మానం

భద్రాద్రి జిల్లా పోలీసు కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలు పసునూరి నాగరాజు, షేక్ మహబూబ్ అలీ, చాచు వెంకటేశ్వర్లును సోమవారం ఎస్పీ రోహిత్ రాజు సన్మానించారు. 37 ఏళ్లపాటు పోలీసు శాఖలో సేవలందించిన ముగ్గురికి శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ప్రశంసా పత్రాలు అందజేశారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఎస్పీ ఆకాంక్షించారు.