హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్, మల్కాపూర్, వెంకటాయపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. చేగుంట 132 కేవీ సబ్‌స్టేషన్ ఫీడర్ మరమ్మతుల కారణంగా మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.