హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంకటహర చతుర్థి సందర్భంగా సామూహిక హోమం

వరంగల్ పట్టణంలోని శివనగర్లో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. సంకటహర చతుర్థి సందర్భంగా గణపతి దేవునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పూజలు చేశారు. అనంతరం ఆలయంలో సామూహిక హోమం వైభవంగా నిర్వహించగా... స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.