హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేత్రదానంపై కలెక్టరేట్‌లో అవగాహన కార్యక్రమం

KMM: నేత్రదానం చేయడం ద్వారా మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేత్రదాన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్రదాన ప్రాధాన్యత, అర్హతలు, నేత్రదానం సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, ఖమ్మం నేత్రనిధి అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించారు.