హైదరాబాద్: 28°C
తెలంగాణ

వంట గ్యాస్ రాక.. వినియోగదారులకు ఇబ్బందులు

WGL: గీసుకొండ మండలానికి చెందిన ఇండియన్ గ్యాస్ ఏజన్సీ డీలర్ గత 8 నెలలుగా తమ గ్రామానికి వంట గ్యాస్ సరఫరా చేయట్లేదని ఐనవోలు మండలం రెడ్డిపాలేనికి చెందిన మహిళలు ఆరోపించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యా దు చేశారు. గ్యాస్ అందక కట్టెల పొయ్యి వినియోగించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వంట గ్యాస్ సరఫరా చేసి న్యాయం చేయాలని కోరారు.