హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.13.69 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన

MBNR: జడ్చర్ల ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌లో రూ.13.69 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంగన్‌వాడీ, పశువైద్యశాల, ఆరోగ్య కేంద్రం, ఫంక్షన్‌ హాళ్లు, కమ్యూనిటీ భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని రూ.6.50 లక్షల నుంచి రూ.18 లక్షలకు పెంచేందుకు ప్రభుత్వంతో పోరాడినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.