WGL: వరంగల్ నగరంలోని 20వ డివిజన్ పరిధి కాశీబుగ్గలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో శ్రావణమాస వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రావణమాస మూడో సోమవారం సందర్భంగా సోమవారం మహాలింగానికి పాలు,తేనె,నెయ్యితో ప్రత్యేక అభిషేకం నిర్వహించి విశేష పూజలు చేశారు.స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తుల సందడిగా మారాయి.
తెలంగాణ
శివాలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు


