హైదరాబాద్: 28°C
తెలంగాణ

అద్దె కట్టని షాపు సీజ్

MDK: తూప్రాన్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలో అద్దె చెల్లించని మున్సిపల్ దుకాణంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని షాప్ నంబర్‌ 2ను మసూదా బేగం అద్దెకు తీసుకున్నట్లు కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో మున్సిపల్ అధికారులు దుకాణంలోని సామాగ్రిని జప్తు చేసి, షాపును సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.