హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి: CPM

BDK: చర్ల మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ CPM పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ MROకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అలాగే ఒక అంబులెన్స్‌ను కూడా ఏర్పాటు చేయాలన్నారు.