హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని వినతి

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆసుపత్రి నిర్మాణంపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.