హైదరాబాద్: 28°C
తెలంగాణ

విముక్తి జాతుల సంక్షేమానికి కృషి: కలెక్టర్

WGL: సంచార, అర్ధసంచార, విముక్తి జాతుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంచార జాతుల విముక్తి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.