హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ పోస్టుకు దరఖాస్తులు

BDK: పినపాక మండలం కస్తూర్బా బాలికల విద్యాలయంలో అసిస్టెంట్‌ కుక్‌ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తహసీల్దార్‌ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో సంకీర్త్‌, ఎంఈఓ నాగయ్య తెలిపారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన స్థానిక మహిళలు సెప్టెంబర్‌ 1 నుంచి 5వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.