హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'స్మశాన వాటిక రోడ్డు కబ్జా.. ప్రజావాణిలో ఫిర్యాదు'

NZB: ఆర్మూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజావాణిలో 26, 27 వార్డు ప్రజలు స్మశాన వాటిక రోడ్డును కబ్జా చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. స్మశాన వాటికకు వెళ్లే రోడ్డును ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నారని చెప్పారు. స్మశాన వాటికకు మృతదేహాలను అంత్య క్రియలకు తీసుకువెళ్లే సమయంలో ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.