హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మున్సిపల్ సమావేశం బహిష్కరణ

WNP: ఆత్మకూర్‌ మున్సిపల్‌ సాధారణ సమావేశాన్ని బీజేపీ, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు బహిష్కరించారు. మున్సిపల్‌ అభివృద్ధికి రూ.7 కోట్లు మంజూరైనా కాంగ్రెస్‌ కౌన్సిలర్లకే నిధులు కేటాయించి తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. కమిషనర్‌ సమాధానం చెప్పడంతో ‘కమిషనర్‌ డౌన్‌ డౌన్‌’ అంటూ సమావేశ మందిరంలోకి దూసుకెళ్లారు. నిధుల కేటాయింపులో సమానత్వం పాటించాలని డిమాండ్‌ చేశారు.