హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ-కేవైసీ చేసుకున్నారా?.. ఈరోజే లాస్ట్

TG: రేషన్‌ E-KYC, మూడు నెలల రేషన్‌ కోటా ఒకేసారి డ్రా చేయడం, చేయూత పింఛన్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. వేలాది పేద కుటుంబాలు ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయలేక ఆందోళన చెందుతున్నాయి. గడువు దాటితే బియ్యం నిలిచిపోతాయేమోనని లబ్ధిదారులు ఆందోళన అవుతున్నారు. ప్రజలు రేషన్‌ షాపులు, మీ-సేవ కేంద్రాల చుట్టూ ఇంకా తిరుగుతునే ఉన్నారు.