యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నోయిడా జిల్లా జేవార్ సమీపంలో వేగంగా వచ్చిన కారు ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
వార్తలు
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి


