హైదరాబాద్: 28°C
తెలంగాణ

దంత వైద్యం అందక అవస్థలు

MBNR: మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్ల కిందట రూ.5 లక్షలు వెచ్చించి దంత చికిత్స యంత్రాన్ని ఏర్పాటు చేశారు. రెండేళ్లు వైద్య సేవలు అందించారు. గతంలో పని చేసిన దంత వైద్యుడు బదిలీపై వెళ్లడంతో పరికరాలు నిరుపయోగంగా మారాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి తీసుకెళ్ళి  వైద్యసేవలు మళ్లీ ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.