హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రకాశ్ రాజ్‌కు నిరసన సెగ

కర్ణాటక విద్యావర్థక సంఘం 50వ వార్షికోత్సవాల ముగింపు సదస్సులో నటుడు ప్రకాష్ రాజ్‌కు నిరసన సెగ తగిలింది. బీజేపీకి చెందిన సవితా, రాహుల్ నేతృత్వంలోని ప్రతినిధులు గో బ్యాక్ ప్రకాశ్ రాజ్ అంటూ నినదించారు. మరోవైపు ఆయన మద్దతుదారులు ప్రకాశ్ రాజ్‌కు స్వాగతం అంటూ నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను పోలీస్ వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.