హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి బ్యాచ్‌ల హల్చల్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాలేజీల పరిసరాలు, పాన్ షాపుల వద్ద గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మత్తుకు బానిసలైన కొందరు యువకులు గుంపులుగా తిరుగుతూ దాడులు, చైన్ స్నాచింగ్‌లకు తెగబడుతున్నారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన పోలీసులు స్పందించి గంజాయి అక్రమ విక్రయాలపై గట్టి నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.