HYD: జూబ్లీహిల్స్‌లో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. హుడా ఎన్ క్లేవ్‌లోని ఓ అపార్ట్‌మెంట్ స్టిల్ట్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి.. 6 కార్లు, 3 బైకులు దగ్ధమయ్యాయి. దట్టమైన పొగతో ఐదు అంతస్తులు కమ్ముకోగా ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి 15 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
జూబ్లీహిల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం


