హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాతబస్తీలో AIMIM కీలక నేత మర్డర్

HYD: ఓల్డ్ సిటీలోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వట్టేపల్లి దర్గా సమీపంలో AIMIM ఏరియా అధ్యక్షుడు మెహబూబ్ అలీపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దారుణంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావమైన ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి CC టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.