BDK: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు తృటిలో ప్రమాదం తప్పింది. అశ్వారావుపేటలో సమావేశం ముగించుకుని ఆదివారం రాత్రి చండ్రుగొండకు వెళ్తుండగా ఎర్రగుంట వద్ద కాన్వాయ్‌కు గేదెలు అడ్డుగా వచ్చాయి. వాటిని తప్పించే క్రమంలో వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేతో పాటు ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యే జారే కాన్వాయ్‌కు ప్రమాదం


