SDPT: జిల్లాలో రానున్న రెండు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై, అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే ఆగస్టు 30, 31 తేదీలలో సిద్దిపేట జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు పడే సూచనలు ఉండటంతో వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. వర్ష సూచన నేపథ్యంలో జిల్లా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
జిల్లాలో రెండు రోజులు ఎల్లో అలర్ట్


