హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురుగుమందు తాగి వృద్ధుడి ఆత్మహత్య

HNK: కాజీపేటకు చెందిన చంద బుచ్చయ్య (65) పురుగుమందు తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై దిలీప్ తెలిపారు. మద్యానికి బానిసైన బుచ్చయ్య శనివారం కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.