ADB: దూదేకుల సంఘం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన తెలంగాణ దూదేకుల నూర్ భాషా సంఘ జిల్లా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్పొరేషన్ ఏర్పాటు, సంఘ భవన నిర్మాణ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
దూదేకుల సంఘ అభివృద్ధికి కృషి చేస్తా: కంది శ్రీనివాస రెడ్డి


