అసోం కామ్‌రూప్ జిల్లా ఖేత్రీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్గేడ్రా రహదారిపై వ్యాన్, ట్రక్కు ఢీ కొని అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వ్యాన్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
వార్తలు
ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి


